మే డే రోజున కార్మికులపై అన్యాయం – యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ ఆగ్రహం
ఘట్కేసర్, మే 1 (ప్రజావాణి): మే డే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) వంటి ముఖ్యమైన రోజున కూడా కార్మికులను అక్రమంగా పనిలో నిమగ్నం చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కే వినోద్ పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని కార్మికులను పరామర్శించారు. వారి సమస్యలను తెలుసుకొని, యజమాన్యం తీసుకుంటున్న ఈ అన్యాయ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాపాడాల్సిన రోజునే వారికి అన్యాయం జరగడం చాలా దురదృష్టకరమని...