మేడ్చల్ జిల్లాలో ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ వినతి… ఎఫ్‌టీఎస్ సిబ్బంది పునరుద్ధరణతో పాటు 15 నెలల బకాయి వేతనాల విడుదల కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం

మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 3: 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ (ఎఫ్‌టీఎస్), డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్లు (డీసీ), కంప్యూటర్ ఆపరేటర్ల సేవలను పునరుద్ధరించాలని, జిల్లాలో తొలగించిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని కోరుతూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎఫ్‌టీఎస్, డీసీ సిబ్బంది జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో వారు పేర్కొన్న వివరాల ప్రకారం, 2018 నుంచి ధరణి, ప్రస్తుతం భూ భారతి ప్రాజెక్టు కింద తహశీల్దార్ కార్యాలయాలు, జాయింట్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు,...