prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 10:18 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మేడే జయప్రదం చేయండి,, ప్రపంచవ్యాప్త కార్మికులారా ఐక్యంగాండి..సిఐటియు

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 29) పోరుమామిళ్ల స్థానిక సిఐటియు ఆఫీసు నందు సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఒకటో తేదీ మేడే జయప్రదం చేయాలని విలేకరుల సమావేశం లో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి‌ యన్ భైరవప్రసాదు మాట్లాడుతూ.1886 సంవత్సరంలో చికాగో నగరంలో పోరాట ఫలితం ఎనిమిది గంటల పని దినాలని ఆ ఎనిమిది గంటల పని దినాలు కోసం పెద్ద ఎత్తున ప్రపంచ కార్మికుల ఐక్యంగా పోరాడి లక్షల మంది అమరులై ఎర్ర రక్తంతో చిందించిన ఆ ఎరుపు రంగు జెండాతోనే ఆఎనిమిది గంటల పని దినాలు సాధించుకున్న రోజు మేడే పండగ అనీ మేడేనుపండగలాగా జరుపుకుంటున్నారని వారన్నారు కార్మికులు సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాలను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 12 గంటల పని దినాలుగా ప్రకటించి కార్మికులను ఉక్కు పాదంతో తొక్కుతున్నారన్నారు కార్మికులు ఐక్యమై చికాగో నగర పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగాలని వారన్నారు మేడే కార్యక్రమానికి పెద్ద ఎత్తున పోరుమామిళ్లలో అంగన్వాడీలు ఆశలు భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కార్మికులు ఆటో తోపుడు బండి హమాలీలు తదితరసంఘాలు ఉద్యోగులు శానిటేషన్ వర్కర్లు హాస్పిటల్ వర్కర్లు ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ప్రకాష్ అధ్యక్షులు సోమయ్య ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి  షేక్ గౌసియాబేగం,జిలానీ భాష బడేపీరా, జమాల్‌ ,ఓబులయ్య రత్నం అలీ భాష హంద్రయ్య, బీబి,మేరీ‌ వెంకటసుబ్బమ్మ వెంకటమ్మ లక్ష్మి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు .