మేడేపల్లి ఐకేపీ కేంద్రంలో రైతుల పై దోపిడీ
మేడేపల్లి ఐకేపీ కేంద్రంలో రైతుల పై దోపిడీ..?ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఎక్కడ..?ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతుల నుంచి ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేయాల్సిన కేంద్ర నిర్వాహకులు, మిల్లర్లు కలిసి రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.రైతుల వాదన ప్రకారం, ఒక్కో ధాన్యం బస్తాలో సుమారు 42 కిలోల ధాన్యం తీసుకుంటూ, రికార్డుల్లో మాత్రం 40 కిలోలకే లెక్కలు నమోదు...