మెడికల్ బోర్డులో కార్మికులకు అన్యాయం
హెచ్‌ఎంఎస్ నల్ల బ్యాడ్జీల నిరసన శ్రీరాంపూర్,జూలై21,ప్రజావాణి: సింగరేణి యాజమాన్యం ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డులో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని నిరసిస్తూ హెచ్‌ఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సంఘం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు, ప్రధాన కార్యదర్శి సారథ్యంలో ఇందారం వన్ ఏ, ఇందారం ఓసీపీ గనుల వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు తిప్పారపు సారయ్య...