prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 4:34 am Digital Edition : RAJASHEKARREDDY

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

 


బెజ్జంకి,ఏప్రిల్ 5(ప్రజవాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముక్కిస మహిపాల్ రెడ్డి,చంద్రారెడ్డి మాతృమూర్తి ముక్కిస కనకవ్వ ఇటీవల పరమపదించారు.అలాగే ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, రమణరెడ్డి మేనత్త ముక్కిస ముత్తవ్వ కూడా మరణించగాఆదివారం వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పరామర్శించి,సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,దివంగతులైన ముక్కిస కనకవ్వ, ముత్తవ్వ ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఈ విషాదాన్ని భరిస్తున్న కుటుంబ సభ్యులకు భగవంతుడు ఓదార్పు కలిగించాలని కోరారు.అలాగే ఈ కష్టకాలంలో తాము ఆ కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి,లింగాల అర్జున్ తదితరులు పాల్గొన్నారు.