మూల్యాంకన విధుల పారితోషికం చెల్లింపులో జాప్యం తగదు. -యుటిఎఫ్ కడప జిల్లా శాఖ విమర్శ.

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే11)  పదవ తరగతి పరీక్షలు,మూల్యాంకన విధుల నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికాన్ని చెల్లించడంలో జాప్యం తగదని,తక్షణమే చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబులు డిమాండ్ చేశారు.సోమవారం ఉదయం కడపలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డిఇఓ షేక్ శంషుద్దీన్ ను కలిసి యుటిఎఫ్ జిల్లా శాఖ పక్షాన వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల పరీక్షలు,మూల్యాంకనం పూర్తయి రెండు మాసాలు కావస్తున్నా,పరీక్షల విధులు నిర్వహించిన చీఫ్...