prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 2:57 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న అడ్లూరి

ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 19 (ప్రజావాణి):

పేద ముస్లిం మైనార్టీల కష్టసుఖాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భరోసా ఇచ్చారు. గురువారం రోజున జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని SR గార్డెన్ లో ఇఫ్తార్ విందు, రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ధర్మారం, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి మండలాలకు చెందిన ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా పాల్గొని కానుకలను అందజేశారు. ధర్మపురి నియోజకవర్గవ్యాప్తంగా సుమారు 2 వేల 50 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ధర్మపురి పట్టణంలోని మసీదులు, ఈద్గా, ఖబరస్థాన్ల అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే 51 లక్షల రూపాయలను కేటాయించినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని మసీదుల అభివృద్ధికి భవిష్యత్తులో మరిన్ని నిధులు మంజూరు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చివరగా, ముస్లిం సోదరులందరికీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు.