prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 2:28 pm Digital Edition : ANIL CHIGURUMAMIDI

ముల్కనూర్ సర్పంచ్ సాంబారి భారతమ్మకు గెజిట్ గుర్తింపు…

 

‘సాంబారీ భారతమ్మ కొమురయ్య’గా అధికారిక పేరు మార్పు ఖరారు!

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూర్ గ్రామ సర్పంచ్ సాంబారి భారతమ్మ తన పేరును అధికారికంగా మార్చుకుంటూ తెలంగాణ ప్రభుత్వ గెజిట్ ఉత్తర్వులను పొందారు. ఇకపై ఆమె పేరు ‘సాంబారి భారతమ్మ కొమురయ్య’గా చట్టబద్ధంగా అమలులోకి వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వ అధికారిక గెజిట్ (నెం. 262, తేదీ: ఏప్రిల్ 2, 2026) ద్వారా ఈ పేరు మార్పును ప్రభుత్వం ధృవీకరించింది. చట్టపరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసి, సంబంధిత అధికారుల ఆమోదంతో ఈ మార్పును నమోదు చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య మాట్లాడుతూ, తన వ్యక్తిగత మరియు అధికారిక అవసరాల దృష్ట్యా ఈ పేరు మార్పు చేపట్టినట్లు తెలిపారు. ఇకపై అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రికార్డులు మరియు ఇతర అధికారిక పత్రాలలో పాత పేరు స్థానంలో కొత్తగా మారిన ‘సాంబారి భారతమ్మ కొమురయ్య’ పేరునే నమోదు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు విజ్ఞప్తి చేశారు.
గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.