ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామం లో అంగన్వాడి సెంటర్ నందు 17 ఏప్రిల్ 2026 శుక్రవారము న 8వ పోషణ పక్వాడ కార్యక్రమం ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ నందిగామ సిడిపిఓ లక్ష్మీ భార్గవి ఆదేశానుసారం 9/04/2026 నుండి23/04/2026 వరకుఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లోని ముఖ్య ఉద్దేశ్యములు, తల్లి మరియు శిశుపోషణ 0 నుండి 3 సంవత్సరాల పిల్లల మెదడు అభివృద్ధి చెందటము మరియు 3 నుండి 6 సంవత్సరాల పిల్లల ఆట ఆధారిత విద్యా అలాగే సామాజ పాత్ర, మరియు జంక్ ఫుడ్స్ ( పానీ పూరి పొటాటో చిప్స్ కురుకురే సోయాటిక్స్ )తినడం వల్ల వచ్చు అనారోగ్య సమస్యలు & స్క్రీన్( సెల్ ఫోన్లు టీవీలు ) అందుబాటులో ఉంచకపోవడం మొదలగు అంశాల గురించి ఐ సి డి సి ఎస్ ప్రాజెక్ట్ నందిగామ సూపర్వైజర్ ఎస్ కె. ఇష్రాత్ గారు వారికి అర్థమయ్యే విధంగా వివరించి జంక్ ఫుడ్స్ బదులుగా రాగి జావా నిమ్మరసం మజ్జిగ సున్నుండలు వంటి పోషకాలు ఉన్న పదార్థాలను పిల్లలకు ఇవ్వడం వలన వారికి మంచి పోషకాలు అందుతాయి ఆట ఆధారిత విద్య పిల్లలు సహజంగా ఆటపాటల ద్వారా విద్య నేర్చుకోవడం వలన వారిలో సృజనాత్మకత పెరిగి సొంతగా ఆలోచించే శక్తి పెరిగి పిల్లలు ఆరోగ్యంగాచురుకుగా ఉంటారని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమమునకు ఐ సి డి ఎస్ సూపర్వైజర్స్ ఎస్.కె.ఇష్రాత్, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ,తల్లిదండ్రులు, అమ్మమ్మలు నాయనమ్మలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.