మున్సిపల్ కార్మికుల సమస్యలకు పోరాటమే ఏకైక మార్గం: కే. రవిచంద్రన్
ఘట్కేసర్, ఏప్రిల్ 15 (ప్రజావాణి):ఘట్కేసర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని మహిళా భవన్‌లో బుధవారం మున్సిపల్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కామ్రేడ్ ఎం. రామచంద్ర అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. రవిచంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గమని తెలిపారు. కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ కార్మికులను తక్షణమే శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని, కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్...