prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 11:38 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మున్నెల్లి రాజుపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

వైయస్సార్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్16) బి.కోడూరు మండలం వన్నెల్లి రాజుపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 50ఏళ్ల జస్నితమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాదంలో మిగతా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.