prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 2:54 am Digital Edition : PRAJA VANI

ముదిగొండ మండల బిఆర్ఎస్ పార్టీ  యువజన కార్యదర్శి భాష<br>

ముదిగొండ మండల బిఆర్ఎస్ పార్టీ  యువజన కార్యదర్శి భాష

*మన ప్రజావాణి మధిర ఆర్ సి మే 8*

కరీంనగర్ *బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం* పై బండి సంజయ్ అనుచరుల దాడిని ఖండించిన :- *ముదిగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ యువజన కార్యదర్శి పాషా
_ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న  బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి ముప్పు అని *ముదిగొండ మండలం  బి ఆర్ ఎస్ పార్టీ యువజన కార్యదర్శి పాషా
*  మండిపడ్డారు. అనునిత్యం ప్రజల సమస్యల పట్ల పోరాడుతున్న మా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  పట్ల బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న  బండి సంజయ్  చేసిన తప్పుడు ఆరోపణలను ఖండించిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  పై కేంద్ర మంత్రి బండి సంజయ్  అనుచరులు వీధి రౌడీల్లాగా విధ్వంసాన్ని సృష్టిస్తూ భయానక వాతావరణ కల్పిస్తూ కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయం పై దాడి చేయడం అనేది సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరియు  కేంద్రంలో అధికారంలో ఉన్నవారే హింసను ప్రోత్సహించడం, పోలీసులు మౌనం వహించడం ఆశ్చర్యాన్ని కలిగించడమే కాక పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా పనిచేస్తుందనేది తెలుస్తుందని హోం మంత్రి లేకనే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నాయని ఇటువంటి అల్లరి మూకల దాడులు ఎక్కువ అవుతున్నాయని మండిపడ్డారు.మా నాయకులపై ఎన్ని కుట్రలు చేసినా,ఎన్ని దాడులు చేసినా  బి ఆర్ ఎస్ పార్టీ వెనుకడుగు వేయదని, ప్రభుత్వ వైఫల్యాల పట్ల, ప్రజల సంక్షేమం కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు అన్ని నిష్ఠంగా గమనిస్తున్నారని ఇటువంటి విధ్వంస అరాచక రాజకీయ వ్యవస్థకు బుద్ధి చెప్పే సమయం దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు._