ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ<br>
ముగిసిన వార్డు సభ్యుల శిక్షణనడికూడ, జూన్ 19(ప్రజా వాణి ) : గత ఐదు రోజులుగా నడికూడ మండల రైతు వేదికలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలన, పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుధ్య చర్యలు సంక్షేమ...