ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ
నడికూడ, జూన్ 19(ప్రజా వాణి ) : గత ఐదు రోజులుగా నడికూడ మండల రైతు వేదికలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ రామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలన, పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుధ్య చర్యలు సంక్షేమ పథకాల అమలు అంశాలపై సభ్యులకు వివరించినట్లు పేర్కొన్నారు. ప్రజలతో సమన్వయం పెంపొందించుకుని పారదర్శకంగా పని చేయాలని సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తౌటం రోహిత్ నేత మాట్లాడుతూ వార్డు సభ్యులకు గ్రామాలలో విశిష్ట బాధ్యత ఉన్నది అని గ్రామాలను ఆదర్శవంతమైన గా తీర్చిదిద్దుటకు సహకరించాలని అన్నారు.అనతరం వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయితీ ఏపీవో విద్యావతి మండల స్థాయి అధికారులు టిఓటీ లు పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.