prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 8:43 pm Digital Edition : PRAJA VANI

ముగిసిన గడువు..? పందిళ్ళపల్లి మాజీ కార్యదర్శి పై విచారణ ఏమాయేను…?<br>

*

*8నెలలు గడుస్తున్న ప్రజావాణి దరఖాస్తుకు మోక్షం ఎన్నాళ్లకు…?

*ఆదేశాలు అందిన 10 రోజుల్లో వివరణలు ప్రశ్నార్థకమే….?

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి రేకుల షెడ్డు వ్యవహారంలో గత ఏడాది నవంబర్లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామానికి చెందిన బాధితులు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో నాటి డిపిఓ రాంబాబు సమగ్రంగా రెండు దశల్లో విచారణ చేసి విచారణ నివేదిక జిల్లా కలెక్టర్కు ఇటీవల సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ మాజీ పంచాయతీ కార్యదర్శి ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మాటూరు పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఆ మేరకు వివరణ కోరుతూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాగా గత నెల 23 వ తారీఖున స్థానిక మధిర మండల పరిషత్ అభివృద్ధి అధికారి ద్వారా సంబంధిత లేఖ అందినట్లు సమాచారం. కాగా అధికారిక ఆదేశాలు అందిన పది రోజుల్లో సదరు పంచాయతీ కార్యదర్శి వివరణాలు ఇవ్వాల్సి ఉండగా నేటికీ అందించలేదని సమాచారం విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో విచారణ పలు దశల్లో ముగించిన జిల్లా పంచాయతీ అధికారులు ఆ మేరకు నివేదిక కొన్ని నెలల అనంతరం అందినట్లు సమాచారం. ఇటీవల ఇచ్చిన ఆదేశాలు ప్రకారం సివిల్ సర్వీసెస్ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించినట్లు వెలుగు చూసిన నేపథ్యంలో అందిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకో ని సదరు మాజీ పంచాయతీ కార్యదర్శి రికార్డులను  తారుమారు చేసి వ్యవహారం గుట్టుగా ఉంచినట్లు కొన్ని రికార్డులు అందుబాటులో లేవంటూ వ్యాఖ్యానించటం విశేషం. గతంలో విధులు నిర్వహించిన మాజీ పంచాయతీ కార్యదర్శి రికార్డులు భద్రంగా ఉన్నట్లు తెలపటం గమనార్హం. ఈ రికార్డులను ప్రామాణికంగా తీసుకోని 2017 సంవత్సరంలోఓ పంచాయతీ కార్యదర్శి రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించకుండా ఇష్టానుసారంగా ఆన్లైన్ ప్రక్రియ చేసినట్లు సమాచారం. దీంతో ఇటీవల నవంబర్ నెలలో ఓ కుటుంబం అక్రమంగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసి తనకా పెట్టి సుమారు 360000 రుణం ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ నుండి పొందినట్లు ఆధారాలతో సహా అధికారులకు సమాచారం అందిందని తెలిసింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి స్పందించి చొరవ తీసుకొని మాజీ పంచాయతీ కార్యదర్శి పై విచారణ ప్రక్రియ వేగవంతంగా చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు జిల్లా ప్రజలు స్థానికులు కోరుతున్నారు.