prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 8:30 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును బాధిత కుటుంబానికి అందజేసిన డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి

బద్వేల్ (ప్రజావాణి జూన్ 27) పట్టణంలోని 23వ వార్డుకు చెందిన శ్రీ షేక్ అబ్దుల్ అజీజ్ అనారోగ్యానికి గురికావడంతో, వారి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.35,184/- (ముప్పై ఐదు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు) విలువైన చెక్కును *ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి శనివారం బాధితుని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ,రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాను కల్పిస్తోందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కలిగి వాటి ప్రయోజనాలను పొందాలని సూచించారు.ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో తాము కూడా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,బాధిత కుటుంబ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.