మీరాలం కుంట ఆక్రమణ, కాలుష్యంపై సుమన్ గౌడ్ ఆగ్రహం….అధికారుల నిర్లక్ష్యంతో సహజ నీటి వనరు కనుమరుగయ్యే ప్రమాదం – వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఘట్‌కేసర్, ఆగస్టు 2: ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ అన్నోజిగూడ గ్రామంలోని మీరాలం కుంట అక్రమ ఆక్రమణలు, కాలుష్యానికి గురవుతుండడంపై బాలగౌని సుమన్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు కుంటను యథేచ్ఛగా మట్టితో పూడ్చివేస్తుండగా, మరోవైపు థ ఆనంద్ హోమ్స్ అపార్ట్‌మెంట్, సంస్కృతి టౌన్‌షిప్‌ల నుంచి వచ్చే మురుగునీటిని నేరుగా కుంటలోకి మళ్లించడం దారుణమని విమర్శించారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇరిగేషన్ శాఖ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, హైడ్రా అధికారులు స్పందించకపోవడం విచారకరమని అన్నారు. కుంట పూర్తిగా...