మీరాలంకుంట ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారుల ఉక్కుపాదం……మురుగునీరు వదిలితే కఠిన చర్యలు తప్పవు: ఏఈఈ మౌనిక హెచ్చరిక
ఘాట్‌కేసర్, ఆగస్టు 07 (ప్రజావాణి): ఘాట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం మున్సిపల్ డివిజన్ అన్నోజిగూడలో ఉన్న మీరాలంకుంట ఆక్రమణలు, కాలుష్యంపై ప్రజాదేశం పత్రికలో వెలువడిన కథనాలపై ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించారు. శుక్రవారం ఇరిగేషన్ ఏఈఈ మౌనిక మీరాలంకుంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చెరువు ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కుంటలోకి అక్రమంగా మురుగునీరు, డ్రైనేజీ వ్యర్థాలను తరలిస్తున్న సింగపూర్ టౌన్‌షిప్, ఆనంద్ హోమ్స్ అపార్ట్‌మెంట్లతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలు అపార్ట్‌మెంట్ల యాజమాన్యాలపై ఏఈఈ మౌనిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....