నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్15)”శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వై ఎస్ ఆర్ సీ పీ సోషల్ మీడియా ప్రతినిధి శ్రీహరి అరెస్టు మీద మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా”కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి శ్రీహరి గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా శ్రీహరి గారి అరెస్ట్ ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నం చేయడమే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుండి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు ఎక్కువయ్యాయి పూడి శ్రీహరి గారంటే సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు.కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.మీడియా విభాగంలో శ్రీహరి గారు పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైనది-శ్రీహరి గారు ఎంతో మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి ,ఆయన పేరు చెబితే ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు- గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీహరి గారు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా పనిచేశారు శ్రీహరి గారు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగానికి జనరల్ సెక్రటరీగా ఉంటూ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు-శ్రీహరి గారు ఎప్పుడూ అసభ్య పదజాలం వాడరు. ఎవరినీ వ్యక్తిగతంగా దూషించే అలవాటులేదు. కేవలం ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వంతోనే ఆయన వ్యవహార శైలి ఉంటుంది.-శ్రీహరి గారు అనవసర సమావేశాలకు రారు ,కేవలం తన పనిపైనే పూర్తి దృష్టి పెడతారు బయట వ్యక్తులతో పరిచయాలు లేవు-వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగానికి సంబంధించిన ఏ అంశం మీదైనా,ఏ వర్గానికి సంబంధించిన వివరాల గురించి అయినా శ్రీహరి గారికి క్షుణ్ణమైన అవగాహన ఉంటుంది- అవసరమైనప్పుడు సరైన సూచనలు,సలహాలు అందించడంలో శ్రీహరి గారు ముందుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి శ్రీహరి గారు ప్రధాన కారకుడని భావించి,ఆ విభాగాన్ని బలహీనపరచాలనే లక్ష్యంతోనే అక్రమ అరెస్ట్ జరిగింది.అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు యూనిఫాంలో ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ,సివిల్ డ్రస్సులో వెళ్లి శ్రీహరి గారిని అదుపులోకి తీసుకోవడం చట్ట విరుద్ధం-సోషల్ మీడియా కేసుల్లో బెయిల్ ఇవ్వాలని, రిమాండ్‌కు పంపకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ,ఇప్పటివరకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా వేధింపులకు గురి చేయడం దారుణం భవిష్యత్తులో ఎవరూ కూటమి నాయకులను ప్రశ్నించకుండా ఉండేలా,బెదిరించడానికి,బ్లాక్ మెయిల్ చేయడానికే,అక్రమ కేసులు పెడుతున్నారు- శ్రీహరి గారి అరెస్టును కేవలం వైఎస్ఆర్ సీపీ శ్రేణులు,జర్నలిస్టులే కాకుండా సామాన్య ప్రజలు కూడా అన్యాయమైన దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నారు-కూటమి ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్నారనే ఏకైక కారణంతో,కుట్రపూరిత ఆలోచనతోనే ఈ అక్రమ అరెస్ట్ పర్వం కొనసాగుతోంది-కూటమి ప్రభుత్వంలో అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయి,సభ్య సమాజం హర్షించని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది-చంద్రబాబు ప్రతిసారీ ఇంతకన్నా దిగజారడులే అనుకున్నప్పుడల్లా, అంతకంటే దారుణంగా దిగజారి ప్రవర్తిస్తున్నాడు-శ్రీహరి గారు చాలా సౌమ్యుడు,రాగద్వేషాలకు అతీతంగా ఉండే వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదు-చంద్రబాబు,లోకేష్ లు కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం,అక్రమంగా జైలుకు పంపడం వంటి చర్యలు మానుకోవాలి- శ్రీహరి గారి ని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర డిజిపి గారిని డిమాండ్ చేస్తున్నా ఏదైనా ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవాలి కానీ,ఇలాంటి వేధింపులు సరికాదు,శ్రీహరి గారి అక్రమ అరెస్టును మరొక్కసారి ఖండిస్తున్నా