కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) ఖాజీపేట మండలం,మిడుతూరు హరిజనవాడలో పునీత పాట్రేపియో దేవాలయం (చర్చి) ప్రారంభోత్సవంలో పాల్గొన్న రెడ్యం సోదరులు.మిడుతూరు గ్రామ పెద్దలు,యువకులు ఆధ్వర్యంలో ఘనంగా,కన్నుల పండుగగా చర్చి ప్రారంభం.ఖాజీపేట మండలం, మిడుతూరు హరిజనవాడలో పునీత పాట్రేపియో దేవాలయం (చర్చి)ని బిషప్ సగినాల్ పాల్ ప్రకాష్ డి.డి కడప మేత్రాసనులు శనివారం ఆశీర్వదించి,ప్రారంభోత్సవం గావించారు.అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా బిషప్ గారిని పెద్ద ఎత్తున ఊరేగిస్తూ గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి,వైఎస్ఆర్సిపి నేత,కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు.చర్చి ప్రారంభ కార్యక్రమంలో ప్రోక్రేటర్ సంబటూరు సురేష్,విచారణ గురువు బల్లారపు ఆశీర్వాదం,వీజీ ఎండి ప్రసాద్ లతోపాటు పెద్ద ఎత్తున ఫాదర్స్,బ్రదర్స్, సిస్టర్స్ పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి బిషప్ సగినాల్ పాల్ ప్రకాష్ డి.డి కడప మేత్రాసనులు ను ఘనంగా సన్మానించారు.అనంతరం బిషప్ రెడ్యం సోదరులతో పాటు చర్చి నిర్మాణానికి సహకరించిన వారందరినీ ఘనంగా సన్మానించారు. మిడుతూరు హరిజనవాడ గ్రామ పెద్దలు తప్పెట చంద్ర, గుడిసె లక్ష్మయ్య,దొడ్డవాండ్ల రాము,బుడ్డోల్ల రాజన్న,తప్పెట రాంబాబు,దొడ్డవాండ్ల ప్రసాదు, దొడ్డవాండ్ల సుబ్బరాయుడు,దొడ్డవాండ్ల అంకుశం,కొండిపోగు యేసయ్య,మునిగాండ్ల రమేష్, ఎర్ర బింగులు గాండ్ల పెద్ద గంగులయ్య,దేవగుడి బాలస్వామి,బుడ్డోళ్ళ ఆనందరావు లతోపాటు గ్రామంలోని యువకులు ఆధ్వర్యంలో ఘనంగా,కన్నుల పండుగగా చర్చి ప్రారంభం జరిగింది.గ్రామ పెద్దలు,యువకులు బిషప్ తో పాటు ఫాదర్స్ ను,బ్రదర్స్ ను,సిస్టర్స్ ను ఘనంగా సన్మానించారు.బిషప్ ప్రార్థనలు,ప్రసంగాలు చర్చి ప్రారంభానికి వచ్చిన వారందరినీ మంత్రముగ్ధులను చేశాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్యం ముందుగా ప్రసంగించారు. ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.