మా ఊరి రోడ్లు మా పిల్లల భవిష్యత్తు కాపాడండి అక్రమ ఇసుక రవాణా పై కల్లూరు గ్రామస్తులు ఆగ్రహం అధికారులకు విజ్ఞప్తి
మా ఊరి రోడ్లు – మా పిల్లల భవిష్యత్తు కాపాడండిఅక్రమ ఇసుక రవాణాపై కల్లూర్ గ్రామస్తుల ఆగ్రహం.. అధికారులకు విజ్ఞప్తికోటగిరి/ప్రజావాణి: పోతంగల్ మండలంలోని కల్లూర్ గ్రామం మీదుగా కోడిచెర్ల గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా రాకపోకలు సాగిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో భారీ ట్రాక్టర్ల రాకపోకల కారణంగా గ్రామంలోని ప్రధాన రహదారులు పూర్తిగా బురదమయంగా మారాయని, దీంతో ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే...