prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 1:43 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

మార్చి 28 తేదీన జాతీయ లోక్ అదాలత్..

 

మార్చి 28 తేదీన జాతీయ లోక్ అదాలత్

సిద్దిపేట్ పోలీస్ కమిషనర్

ఎస్ రష్మీ  పెరుమాళ్, ఐపిఎస్

సిద్దిపేట,మార్చి24,ప్రజావాణి

సిద్దిపేట మార్చి 28 తేదీన జాతీయ లోక్ అదాలత్ జరగనున్నది. చిన్న చిన్న కంపౌండబల్ కేసులలో కోర్ట్ చుట్టూ తిరుగుతున్న ప్రజలకి ఇదొక మంచి అవకాశం. రాజీ పడ దగిన కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, రోడ్డు ప్రమాదాల కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్  టౌన్ న్యూసెన్స్ కేసులు, చెక్ బౌన్స్ కేసులో  ఇతర రాజీ పడ దగిన కేసులలోని నిందితులు , ఫిర్యాదీదారులు సంబంధిత పోలీస్ స్టేషన్ ని లేదా న్యాయస్థానాన్ని నేరుగా సంప్రదించి రాజి పడవచ్చు .చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని , డబ్బులను వృధా చేసుకోవద్దు. జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. పోలీస్ అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్లో రాజీ పడ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పిస్తున్నారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని తెలియజేయడమైనది.