మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి వేధింపుల నుండి కాపాడండి
– బాధితులు ఈగ కార్తీకరెడ్డి, జనార్ధనరెడ్డి
– కడీలు విరగొట్టి కబ్జాకు యత్నం
– 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
– తాము 2022లో కొన్నామని బాధితుల క్లారిటీ
షాబాద్// జులై 02(ప్రజావాణి)
హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యక్తులు షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లిలో కొన్న భూమిని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి కబ్జాకు యత్నించాడాని. కడీలు విరగొట్టి మరీ ఆక్రమించుకునే ప్రయత్నం చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదవగా.. గురువారం హైదరాబాద్ కు చెందిన ఈగ కార్తీక్ రెడ్డి, విజయలక్ష్మి, జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. తాము ఏట్ల ఎర్రవల్లిలోని సర్వే నెంబర్లు 183,188,199లో ఉన్న 3.04 ఎకరాల భూమి 2022లో సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, ఆ తర్వాత చుట్టూ కడీలు పాతి ఫెన్సింగ్ వేశామని చెప్పారు. గత నెల 29న అర్దరాత్రి సమయంలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ కుమ్మరి వేణు గోపాల్ సహా11మంది కలిసి 500 కడీలు విరగట్టి కబ్జా చేశారని, 6 సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారని వాపోయారు. తమకు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కబ్జాకు యత్నించిన 11 మందిపై కేసు నమోదు అయ్యిందని, (ఎఫ్ ఐ ఆర్ 274/26) వెల్లడించారు.


