prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 8:43 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మార్కాపురం సమీపంలోని రాయవరం ఎస్టేట్ వద్ద రోడ్డు ప్రమాదం

మార్కాపురం జిల్లా..ప్రజావాణి న్యూస్ (మే 07).మార్కాపురం సమీపంలోని రాయవరం ఎస్టేట్ వద్ద రోడ్డు ప్రమాదమార్కాపురం సమీపంలోని రాయవరం ఎస్టేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారత్ పెట్రోలియం బంక్ సమీపంలో ఆగి ఉన్న ఎస్ఎల్వీటి బస్సును వెనకవైపు నుంచి ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఘటన జరిగిన సమయంలో బస్సు నిలిపి టైర్లు మార్చుకుంటూ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం అదుపు తప్పి బస్సును ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు..