మార్కాపురం జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) మార్కాపురం దళిత హక్కుల పోరాట సమితి ప్రధమ మహాసభలను విజయవంతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి మార్కాపురం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూర్ణ కంటి తిరుమలయ్య, పందిటి మోహన్ కోరారు.శనివారం మార్కాపురంలోని పూల సుబ్బయ్య భవన్ నందు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభల కరపత్రాలను సిపిఐ సీనియర్ నాయకులు అందె నాసరయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల దీనగాధ వర్ణాదితమని అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే దళితులను వినియోగించుకుంటున్నారని వారి అభివృద్ధి కి కావలసిన ప్రణాళికలో రచించడంలో కానీ అమలపరచడంలోనూ ప్రభుత్వాలు విఫలం చెందాయని అన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసిపి ప్రభుత్వం దళితులను ఏ విధంగా దగా చేసిందో అందరూ చూసే ఉంటారు అదే కోవలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా దళితులను ఓటు బ్యాంకు కోసం వాడుకుంటుందని ఇక రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు కులాలు మతాలుగా విడగొట్టి లబ్ధి పొందేందుకు తెలుగుదేశం పార్టీ చూస్తుందని అన్నారు ఈనెల 22వ తేదీ బుధవారం మార్కాపురం జిల్లాలోని సిపిఐ కార్యాలయం పూల సుబ్బయ్య భవన్ నందు జరుగు దళిత హక్కుల పోరాట సమితి (DHPS) జిల్లా మహాసభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్. కాసిం, నాగయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.