మార్కాపురంలో సాగు కాలువ పూడికతీత పనులు పూర్తి: రబీ పంటలకు పుష్కలంగా సాగునీరు

కూటమి ప్రభుత్వ చొరవతో రూ. 3.10 లక్షల జలశక్తి నిధుల కేటాయింపు హర్షం వ్యక్తం చేస్తున్న మార్కాపురం రైతాంగం వైఎస్సార్ కడప జిల్లా (ప్రజావాణి జూన్ 09) పొరుమామిళ్ళ మండలంలోని మార్కాపురం గ్రామ రైతుల దశాబ్దాల సాగునీటి సమస్యకు తెరపడింది. రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం సాగు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మార్కాపురం చెరువు నుండి వెళ్లే ప్రధాన పంట కాలువ పూడికతీత పనులను విజయవంతంగా పూర్తి చేయించింది. గత కొంతకాలంగా తీవ్రంగా పూడిక పేరుకుపోయి,...