మారేడుపల్లిలో విద్యుదాఘాతంతో ఎద్దు మృతి: 50 వేల నష్టం
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుద్దే తిరుపతి తన ఆరేళ్ల ఎద్దుతో ఉదయం 11:30 గంటల సమయంలో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఆ ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న మండల పశువైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ జరిపారు. మరణించిన ఎద్దు విలువ సుమారు 50 వేల రూపాయలు ఉంటుందని వెటర్నరీ డాక్టర్ బూర మనోజ్ కుమార్ తెలిపారు.