prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 3:01 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

మానవత్వం చాటుకున్న సర్పంచ్ మల్లేష్ గౌడ్

ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో అప్పుల బాధతో ఉరివేసుకుని మృతి చెందిన మడ్డి ఇందిర అంత్యక్రియలను గ్రామ సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ దగ్గరుండి నిర్వహించారు. తానే స్వయంగా పాడే మోసి, సొంత ఖర్చు రూ.20 వేల తో సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు పూర్తి చేశారు. సర్పంచ్‌గా గెలిచినప్పటి నుండి ఇప్పటివరకు ముగ్గురికి తన సొంత డబ్బులతో అంత్యక్రియలు జరిపించి పెద్దదిక్కుగా నిలిచారు. సర్పంచ్ చేసిన ఈ గొప్ప కార్యాన్ని గౌడ కులస్థులు, గ్రామ ప్రజలు అభినందించారు.