సిద్దిపేట్, మార్చి 31, ప్రజావాణి
మానవతా దృక్పథంతో సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ చంద్ర శేఖర్, ఒక ప్రాణాన్ని కాపాడి ఆదర్శంగా నిలిచారు.సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో మేడారం ప్రాంతానికి చెందిన ఒక రోగికి అత్యవసర చికిత్స నిమిత్తం ‘ఓ పాజిటివ్’ రక్తం అవసరమని తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే, కానిస్టేబుల్ చంద్ర శేఖర్, ఎటువంటి ఆలస్యం చేయకుండా సిద్దిపేట ప్రభుత్వ రక్తనిధి కేంద్రానికి చేరుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, అవసరమైన రక్తాన్ని దానం చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడడంలో తనవంతు కృషి చేశారు.అత్యవసర సమయంలో పోలీసు శాఖకు చెందిన సిబ్బంది ఇలా ప్రజలకు అండగా నిలవడంపై స్థానికులు, రోగి బంధువులు చంద్ర శేఖర్ గారిని అభినందించారు.