మాధారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహణ
ఘట్కేసర్, ఏప్రిల్ 19 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని మాధారం గ్రామంలో ఆదివారం సంస్కృతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమం కింద ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని స్ఫూర్తి ఆర్గనైజేషన్ అనుబంధంగా, ఎస్‌వి ఫిజియో & రిహాబిలిటేషన్ సెంటర్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. శిబిరాన్ని ఉద్దేశించి స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ...