prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 1:26 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

మాదిగ అమరవీరులకు ఘన నివాళులు

మాదిగ అమరవీరులకు ఘన నివాళులు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 01 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని స్వామి వివేకానంద కూడలి వద్ద ఎమ్మార్పీఎస్ ఉమ్మడి వెల్గటూర్ మండల అధ్యక్షులు చెన్న కుమారస్వామి ఆధ్వర్యంలో ఆదివారం మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోకెనపల్లి సతీష్, సీనియర్ నాయకులు మంతెన లక్ష్మణ్, గజ్జెల రాజేశం, మంతెన శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కనుకుట్ల రఘు, ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీనివాస్, లింగంపల్లి జస్వంత్, మంతెన సురేష్, చెన్న సతీష్, మల్లేశం, మంతెన చందు, బచ్చల వినయ్ తదితరులు పాల్గొన్నారు.