మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు..చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి..పట్టణ సీఐ పి శ్రీను.

నందిగామ రూరల్,(మే21 ప్రజావాణి) ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఆదేశాల మేరకు నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో గోళ్లమూడి రుద్రవరం గ్రామంలో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 భాగంగా పట్టణ సీఐ పి శ్రీను ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.డ్రగ్స్‌, గంజాయి లాంటి మాదక ద్రవ్యాల వినియోగానికి, చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని గంజాయి మహమ్మారి చాలా సమస్యలకు కారణమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల అలవాటు నుంచి బయట పడేందుకు...