మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ రెండో రోజు పులివెందుల పర్యటన

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22)పులివెందుల  మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన మూడురోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ రోజు ఉదయం ఇప్పట్ల గ్రామానికి చేరుకున్న వైయస్‌ జగన్‌ తొలుత గ్రామ శివార్లలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు,శాంతి,అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.అనంతరం గ్రామ ప్రజల సమస్యలు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.తరువాత ఇటీవల మరణించిన...