prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 6:57 am Digital Edition : PRAJA VANI

మాజీ మంత్రి అప్పలరాజును విచారించిన కాశీబుగ్గ పోలీసులు

మాజీ మంత్రి అప్పలరాజు ను విచారించిన కాశీబుగ్గ పోలీసులు ..

మీడియా పై  ఆంక్షలు. విధించిన పోలీస్?

తాహసిల్దార్ ,ఆర్టీవో ఆఫీస్లకు  వెళ్లకుండా నియంత్రంచిన పోలీస్…

ఇబ్బంది పడ్డ ప్రజలు

పలాస, ప్రజావాణి ప్రతినిధి

మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు ను పోలీసు బందోబస్తు నడుమ విచారణకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు . దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి
పలాస లో గత నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ను ఒక రోజు పాటు పోలీస్ కస్టడీలో విచారించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో మంగళవారం ఉదయం అంపోలులోని జిల్లా జైలు నుంచి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు అధికారులు తరలించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలను తారుమారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను సాయంత్రం 5 గంటల వరకు విచారించారు అనంతరం తిరిగి జిల్లా జైలుకు తరలించనున్నారు. కేసులో అప్పలరాజు ఏ-3 నిందితుడిగా ఉన్నారు. గత నెల 23 న ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా, గడువు ఈ నెల 5తో ఈ ముగియనుంది. ఇదే కేసులో ఎ-1, ఎ-2 నిందితులుగా ఉన్న ఆరవ్ వర్మ, సిద్ధార్థ త్యాడికి ఇప్పటికే బెయిల్ మంజూరై జైలు నుంచి బెయిల్ విడుదలయ్యారు. అప్పలరాజుకు  బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే కాశీబుగ్గ పోలీసులు వ్యూహాత్మకంగా కస్టడీ పిటిషన్ దాఖలు చేశారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి విచారణ నేపథ్యంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.