మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కాపాడిన డాక్టర్ మమతారెడ్డి

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కాపాడిన డాక్టర్ మమతారెడ్డి చెన్నారావుపేట జూలై 26 ప్రజావాణి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆదివారం తీవ్ర గుండెపోటు రాగా, కుటుంబసభ్యులు హన్మకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ మమతారెడ్డి సమయస్ఫూర్తితో స్పందించి, అత్యంత క్లిష్ట పరిస్థితిలోనూ ఏకంగా తొమ్మిది సార్లు సీపీఆర్ (CPR) నిర్వహించి ఆయన ప్రాణాలు కాపాడారు. సుదర్శన్ రెడ్డి ప్రాణాలు నిలిపిన డాక్టర్ మమతారెడ్డిని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేకంగా ప్రశంసించారు....