prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 8:25 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కాపాడిన డాక్టర్ మమతారెడ్డి

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కాపాడిన డాక్టర్ మమతారెడ్డి

చెన్నారావుపేట జూలై 26 ప్రజావాణి

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆదివారం తీవ్ర గుండెపోటు రాగా, కుటుంబసభ్యులు హన్మకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ మమతారెడ్డి సమయస్ఫూర్తితో స్పందించి, అత్యంత క్లిష్ట పరిస్థితిలోనూ ఏకంగా తొమ్మిది సార్లు సీపీఆర్ (CPR) నిర్వహించి ఆయన ప్రాణాలు కాపాడారు. సుదర్శన్ రెడ్డి ప్రాణాలు నిలిపిన డాక్టర్ మమతారెడ్డిని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆమె సేవలను బిఆర్ఎస్ శ్రేణులు, వైద్య వర్గాలు కొనియాడాయి. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.