మాజీ ఎమ్మెల్యే పెద్ది ప్రాణాపాయం నుండి కోలుకోవాలి

మాజీ ఎమ్మెల్యే పెద్ది ప్రాణాపాయం నుండి కోలుకోవాలి.. చెన్నారావుపేట జూలై 29 ప్రజావాణి నర్సంపేట రాజకీయం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. నియోజకవర్గ ప్రగతి రథసారథి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న వార్త వినగానే చెన్నారావుపేట గడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గుండెల్లో ధైర్యం నింపే నాయకుడికే గుండెపోటు రావడాన్ని అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు తట్టుకోలేకపోతున్నారు. తమ నాయకుడు ఆయురారోగ్యాలతో పునరుత్తేజం పొంది తిరిగి రావాలని కోరుతూ చెన్నారావుపేట గ్రామ శివాలయం బుధవారం...