prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 8:34 am Digital Edition : PRAJA VANI

మాజీ ఎంపీ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డిని వివాహానికి ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకుడు బుల్లెట్ రవి

మాజీ ఎంపీ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డిని వివాహానికి ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకుడు బుల్లెట్ రవి

పెనుమూరు ( ప్రజావాణి ప్రతినిధి) జూలై 29

వైస్సార్ కడప జిల్లా వేంపల్లిలో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ మీడియా చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి గారిని ఆయన స్వగృహంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుల్లెట్ రవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా బుల్లెట్ రవి తన కుమార్తె M. జ్ఞానేశ్వరి వివాహమహోత్సవ ఆహ్వాన పత్రికను డాక్టర్ తులసి రెడ్డి గారికి అందజేశారు. ఈ వివాహ వేడుకలు కాణిపాకంలోని M.G గార్డెన్‌లో ఆగస్టు 26న (రిసెప్షన్), ఆగస్టు 27న (ఉదయం ముహూర్తం) జరగనున్నాయి. ఈ శుభకార్యానికి కుటుంబ సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని ఆయన కోరారు.ఆహ్వానాన్ని స్వీకరించిన డాక్టర్ తులసి రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ, వివాహ మహోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని చెప్పడం జరిగింది