మహేంద్రనగర్ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజావాణిలో వినతి
ఘట్‌కేసర్, జూలై 20: ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని అన్నోజిగూడ మహేంద్రనగర్ దివ్యాంగులు, సకలాంగుల కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీవాసులు ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కాలనీలో ఉన్న బోర్‌వెల్ చాలా కాలంగా పాడైపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వినతిలో పేర్కొన్నారు. ఈ సమస్యపై గత ఫిబ్రవరి నెలలోనే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని తెలిపారు. బోర్‌వెల్ మోటారును మరమ్మతుల కోసం తీసుకెళ్లి తిరిగి అమర్చుతామని అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం...