prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 7:04 am Digital Edition : ANIL CHIGURUMAMIDI

మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట

హుస్నాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ కంది తిరుపతిరెడ్డి

మన ప్రజావాణి ప్రతినిధి(చిగురుమామిడి):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తోందని హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌ కంది తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కరీంనగర్‌ (రూరల్‌) ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం చిగురుమామిడి మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమైన “మహిళా వారోత్సవాల” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ పరిధిలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని రిబ్బన్‌ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌ కంది తిరుపతిరెడ్డి మాట్లాడుతూ… మహిళా సాధికారత, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం మరియు పౌష్టికాహార భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు మెరుగైన వాతావరణంలో, ఆధునిక వసతులతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందించాలనే ఉద్దేశంతోనే నూతన అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

సోమవారం నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించనున్న మహిళా వారోత్సవాల్లో భాగంగా జరిగే అవగాహన సదస్సులు, ఆరోగ్య కార్యక్రమాలు, మహిళా అభివృద్ధి కార్యక్రమాలను గ్రామీణ మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీఓ అధికారిణి శ్రీలత, పీఆర్‌ఏఈ నిరంజన్‌రెడ్డి,స్థానిక ఉపసర్పంచ్‌ కాశవేని విజయ,విద్యా కమిటీ చైర్మన్‌ గొల్లపల్లి అరుణ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, మురహర్‌రెడ్డి, ఐరెడ్డి సత్యనారాయణరెడ్డి, దోమ శ్రీనివాస్‌రెడ్డి, దోమ తిరుపతిరెడ్డి, వంగ కనకయ్యలతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు పన్యాల అనురాధ, ధనలక్ష్మి, ఇందిరా, వివిధ వార్డు సభ్యులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.