మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళల భవిష్యత్తుకు మైలురాయి: కొమ్మిడి శోభా రెడ్డి
ఘట్కేసర్, ఏప్రిల్ 17 (ప్రజావాణి): దేశ రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మక నిర్ణయమని కొమ్మిడి శోభా రెడ్డి అన్నారు. ఈ బిల్లు అమలులోకి వస్తే మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగి, సమాజంలో సమానత్వం బలపడుతుందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నప్పటికీ, రాజకీయాల్లో వారికి తగిన అవకాశాలు లభించడం లేదని ఆమె అన్నారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు రాజకీయాల్లో స్థిరమైన స్థానం లభించి, నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం...