మహిళల స్వయం ఉపాధికి జ్యూట్ బ్యాగ్ శిక్షణ – 35 మందికి ధ్రువపత్రాల ప్రదానం

ఘట్‌కేసర్ ప్రాంతంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో ఎంఎస్‌ఎంఈ వారి సౌజన్యంతో 35 మంది మహిళలకు జ్యూట్ బ్యాగ్ తయారీపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ అనంతరం మహిళల ప్రతిభను గుర్తిస్తూ వారికి ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని, జ్యూట్ బ్యాగ్ తయారీ ద్వారా ఆదాయ వనరులు పెంపొందించుకోవచ్చని సూచించారు. ఇటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మహిళల సాధికారతకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ...