మహిళల, విద్యార్థినుల రక్షణే ‘షీ టీమ్’ ధ్యేయం: ఇన్స్పెక్టర్ ఎ.బి. దుర్గ..దేశాయ్ బీడీ కంపెనీలో షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు..

సిద్దిపేట్ జూన్ 9, ప్రజావాణి మహిళల, విద్యార్థినుల మరియు బాలికల రక్షణే ధ్యేయంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'షీ టీమ్స్' నిరంతరం శ్రమిస్తున్నాయని సిద్దిపేట ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎ.బి. దుర్గ పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని దేశాయ్ బీడీ కంపెనీలో సిద్దిపేట జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళా కార్మికులకు, సిబ్బందికి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్స్పెక్టర్ దుర్గ మేడమ్ మహిళలకు చట్టాలపై, వారి హక్కులపై విస్తృత అవగాహన కల్పించారు.  ...