prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 7:16 am Digital Edition : PRAJA VANI

మహిళల ఆర్థిక స్వావలంబనకు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఆదర్శం

మహిళల ఆర్థిక స్వావలంబనకు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఆదర్శం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.*బుధవారం ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దాన కిషోర్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్‌ లతో కలిసి పర్యటించిన డిప్యూటీ సీఎం వెంకటాపురంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 2 కోట్ల 84 లక్షలతో ఏర్పాటు చేసిన 1 మెగా వాట్  సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించి, కోటి 30 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా *డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ*  మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.*దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు.* గతంలో వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల పథకాలను తిరిగి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. *మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకు ఉన్న వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఇందిరమ్మ క్యాంటీన్లు, ఆర్టీసీకి అద్దె బస్సులు, టర్మరిక్ యూనిట్లు వంటి పెద్ద వ్యాపారాల్లో మహిళా సంఘా లను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.* ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తామని ప్రకటించగా, తొలి రెండున్నరేళ్లలోనే రూ.66 వేల కోట్ల రుణాలు పంపిణీ చేశామని తెలిపారు.
*మహిళా సంఘాలకు తక్కువ ధరకు భూములు కేటాయించి, సాంకేతిక సహకారం అందిస్తూ సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేపడుతున్నామని, ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.* రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినా ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. గతంలో 15 వేల మెగావాట్లుగా ఉన్న పీక్ డిమాండ్ ప్రస్తుతం 18,480 మెగావాట్లకు చేరిందన్నారు.*బోనకల్ మండలంలోని అన్ని గ్రామాలకు పైలట్ ప్రాజెక్టు క్రింద సోలార్ విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.* పర్యావరణ పరిరక్షణలో భాగంగా రైతులు పంట అవశేషాలను కాల్చవద్దని సూచించారు. పంట అవశేషాల దహనం వల్ల అగ్ని ప్రమాదాలు, కాలుష్యం పెరుగుతాయని, భవిష్యత్తులో ఎవరైనా కాల్చితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కావడం స్ఫూర్తిదాయకమన్నారు. మహిళల అభివృద్ధే తెలంగాణ ప్రగతికి పునాది అన్నారు.మహిళలకు నాణ్యమైన ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందన్నారు

సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ మహిళా సంఘాలు భారీ సోలార్ ప్రాజెక్టులను నిర్వహించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రెడ్‌కో సిఎండి అనిల మాట్లాడుతూ వెంకటాపురం గ్రామంలో రెండు మహిళా సంఘాలు కలిసి ఏర్పాటు చేసిన ఈ 1మెగా వాట్ సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు సుమారు రూ.4.5 లక్షల ఆదాయం మహిళా సంఘాలకు లభిస్తుందని పేర్కొన్నారు.

జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా రూ.3 కోట్ల విలువైన ఈ భారీ ప్రాజెక్టు విజయవంతంగా ఏర్పాటు చేశామని తెలిపారు. *సోలార్ ప్లాంట్ నిర్వహణపై మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని మరిన్ని ఉపాధి అవకాశాల సృష్టికి వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం టర్మరిక్ బాయిలర్ యూనిట్‌లను, ఎర్రుపాలెం మండలంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు ఇండక్షన్ స్టవ్‌లు  పంపిణీ చేసి, చైతన్య మండల సమాఖ్య సభ్యులకు 10 కోట్ల 45 చెక్కును డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.