prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 1:59 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి – దద్దాల

ప్రజావాణిన్యూస్(ఏప్రిల్07)మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి – దద్దాల,ఆంధ్రజ్యోతి లో కొత్తపలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ అత్యంత దిగజారి వైఎస్సార్సీపీ నేతలు, నాయకుల కుటుంబ సభ్యులు వారి భార్యలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా,బాధాకరం ఉన్నాయని కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయం నుండి మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలపై దిగజారి వ్యాఖ్యలు చేయించడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్లాన్-బి గా మావిగన్(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు ) 110 కి.మీ కారిడార్ ను రాజధాని ప్రాంతగా ప్రకటించాలని ప్రతిపాదించిన తరువాత కూటమి నేతల అవినీతి కోటలు బద్దలవుతున్నాయని చెప్పారు.ఆ భయంతోనే ఎల్లో మీడియా నీచంగా వ్యక్తిత్వ హననానికి దిగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర రాజధానిపై ప్లాన్-బీగా జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్ పై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోందని, ఇది చూసి ఓర్వలేక ప్రజల దృష్టి మళ్లించాలని కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి సోషల్ మీడియా లో నెగటివ్ ట్రోలింగ్ చేయిస్తున్నారన్నారు.మహిళల గురించి      ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తప్పుగా మాట్లాడాడు.అతని మాటల్ని ఖండించాల్సింది పోయి సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ట్వీట్స్‌తో వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని మహిళలంటే కూటమి నేతలకు ఎంత గౌరవమో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు.మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని,జర్నలిజం ముసుగులో ఇలాంటి అక్షర వ్యభిచారం చేయొద్దు అని కోరారు.ఏబీఎన్ రాధాకృష్ణ ఇకనైనా బుద్ది తెచ్చుకోవాలని, మహిళలపై తప్పుడు రాతలు రాసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని దద్దాల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు