prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 1:21 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

మహాశివరాత్రి భద్రత ఏర్పాట్లను పరిశీలించిన సీఐ

మహాశివరాత్రి భద్రత ఏర్పాట్ల పరిశీలన

పాల్గొన్న సిఐ రాంనర్సింహ రెడ్డి, ఎస్సైలు ఉదయ్ కుమార్, మహేష్

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్ వెల్గటూర్ ఫిబ్రవరి 13 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంను గురువారం రోజున ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంనర్సింహ రెడ్డి, ఉమ్మడి వెల్గటూర్ ఎస్సై పులిచెర్ల ఉదయ్ కుమార్, ధర్మపురి ఎస్సై మహేష్ లతో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈనెల 15 ఆదివారం రోజున భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని గోదావరి పుణ్యస్నానాలు ఆచరిస్తారు కాబట్టి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలపై పర్యవేక్షించి, తగిన సూచనలు తెలిపారు. స్నాన గట్టాలను, స్త్రీలు దుస్తుల మార్పు వంటి ప్రదేశాలను ఆయన పరిశీలించారు. రద్దీ ప్రదేశాలలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వెల్గటూర్ ఎస్సై పులిచర్ల ఉదయ్ కుమార్, ధర్మపురి ఎస్సై మహేష్, స్థానిక సర్పంచ్ పర్ష కోటయ్య, ఆలయ ఈవో కాంతారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేష్ తో పాటుగా ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు.