prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 11:39 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మహాత్మ బసవ జయంతి సందర్భంగా ఘన నివాళులు.చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ

తిరుపతి జిల్లా ప్రజా వాణి న్యూస్ (ఏప్రిల్20)   మహాత్మ బసవ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మహాత్మ బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, మహాత్మ బసవేశ్వరుడు సమాజంలో సమానత్వం, న్యాయం, సత్యం కోసం చేసిన సేవలు అమోఘమని తెలిపారు. ఆయన బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, ముఖ్యంగా యువత ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ వెంకటరావు (పరిపాలన) శ్రీ శ్రీనివాసరావు (సాయిదళం) శ్రీమతి శ్రీ గీతా కుమారి గారు (ఎస్ బి) మరియు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని మహాత్మ బసవేశ్వరుని సేవలను స్మరించుకున్నారు.