మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించాను;;బద్వేలు కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న
ప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)బద్వేలు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించాను. ఈ సందర్భంగా తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించి, డిజిటల్ క్లాసుల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నాను. విద్యార్థులకు నా వంతు ప్రోత్సాహంగా నోట్ బుక్కులు, రైటింగ్ ప్యాడ్‌లు (అట్టలు), మరియు పెన్నులను పంపిణీ చేయడం జరిగింది.అనంతరం 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన' పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశాను. భోజనం చేసే సమయంలో విద్యార్థులు తమ సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా...