మసీదు దారి ఆక్రమణపై పోలీసులకు ముస్లిం సంఘం ఫిర్యాదు

  బెజ్జంకి,జూన్ 27 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో స్థానిక మసీదుకు వెళ్లే ప్రవేశ మార్గాన్ని ఫెన్సింగ్ వైర్‌తో మూసివేసి ఆక్రమించారని ఆరోపిస్తూ బెజ్జంకి ముస్లిం సంఘం ప్రతినిధులు శుక్రవారం బెజ్జంకి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.మసీదుకు నమాజ్‌కు వచ్చే భక్తులు ప్రవేశ మార్గం మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి, ఆక్రమణను తొలగించి మసీదుకు వెళ్లే దారిని పునరుద్ధరించేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే, ప్రార్థనా స్థలానికి వెళ్లే మార్గంలో ఎలాంటి...